మియాపూర్ లో పరిస్థితి అదుపులో ఉంది: సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి

మియాపూర్ లో పరిస్థితి అదుపులో ఉంది: సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి

హైదరాబాద్: మియాపూర్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు సైబరాబాద్ సిపీ అవినాస్ మహంతి. గత కొన్ని రోజులుగా మియాపూర్ లోని ప్రభుత్వ స్థలంలో స్థానిక ప్రజలు గుడిసెలు వేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు వచ్చిన ప్రజలను శనివారం రాత్రి ఆప్రాంతం ను తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. HMDA అధికారులతో కలిసి మియాపూర్ లో ఘటనాస్థలానికి చేరుకొని ఉద్రిక్తత కు దారి తీసిన  పరిస్థితులను తెలుసుకున్నారు సీపీ అవినాష్ మహంతి. 

అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రజలను వెనక ఉండి నడిపించిన కబ్జాదారులు గురించి తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కబ్జాదారులపై అవసరమైతే పీడీ యాక్టు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. 

మియాపూర్ ఘటనలో ఇద్దరు మహిళలు సహా పదిమందిపై కేసు 

హైదరాబాద్: మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సంగీత, సీత అనే ఇద్దరు మహిళలు.. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని అక్కడి మహిళలను రెచ్చగొట్టారని ఆరోపణలో వీరిని అరెస్ట్ చేశారు. స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ లు పెట్టి పేదలకు ఆశచూసి డబ్బులు వసూలు చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. పేదలను రెచ్చగొట్టిన కేసులో సంగీత, సీత, సంతోష్ లతోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారు. రెచ్చగొట్టి ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు విసిరారని వారిపై కేసులు నమోదు చేశారు.